mictv telugu

ఎన్నారైలు పెళ్లిళ్లను రిజిస్టర్ చేసుకోపోతే పాస్‌పోర్ట్ రద్దు..

February 12, 2019

కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో వుండే ఎన్నారైలపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ఎన్‌ఆర్‌ఐల వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు-2019ని ప్రవేశపెట్టింది. ఎన్నారైలు భారత్‌కు చెందిన మహిళను లేదా విదేశాలలో సహచర ఎన్నారైలని వివాహం చేసుకున్న 30 రోజులలోగా తమ పెండ్లిని రిజిస్టర్ చేసుకోవాలి. లేదా వారి పాస్‌పోర్టు జప్తు చేయబడుతుంది లేదా రద్దవుతుందని స్పష్టంచేసింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఈ నెల ఒకటిన ప్రతిపాదించిన తాత్కాలిక బడ్జెట్‌ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం పాస్‌పోర్ట్ చట్టాన్ని, నేర శిక్షా స్మృతిని కూడా సవరించనున్నారు.

Telugu news Bill to Cancel Passports Attach Assets of Errant NRI Spouses Tabled in Rajya Sabha....

కోర్టులకు అధికారం..

ఓ ఎన్‌ఆర్‌ఐ భారతీయ మహిళను ఇక్కడ పెండ్లి చేసుకుంటే స్థానిక చట్టాల ప్రకారం తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. వివాహం విదేశాల్లో జరిగితే అక్కడి నిర్దేశిత అధికారుల వద్ద తమ పెండ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతిపాదిత చట్టం భారతీయ మహిళలను దేశంలో లేదా విదేశాల్లో వివాహం చేసుకునే ఎన్‌ఆర్‌ఐలకు వర్తిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం అపరాధులుగా నిర్ధారణ అయిన ఎన్‌ఆర్‌ఐలు చట్టం ముందు లొంగని యెడల వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టులకు లభిస్తుంది. కోర్టులు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా నిందితులకు వారంట్లు, సమన్లు జారీ చేస్తాయి. Telugu news Bill to Cancel Passports Attach Assets of Errant NRI Spouses Tabled in Rajya Sabha