మట్టితో గూడు కట్టుకున్న పిచుకలు... - MicTv.in - Telugu News
mictv telugu

మట్టితో గూడు కట్టుకున్న పిచుకలు…

April 13, 2018

పక్షులు ఆకాశంలో స్వేచ్చగా విహరిస్తుంటాయి. అలాంటి పక్షులు  తమ నివాసాలను ఎలా నిర్మించుకుంటాయో తెలుసా ? గడ్డిపోచలతో నిర్మించుకుంటాయి. ఒక్కో గడ్డిపోచను తెచ్చి అల్లికగా పేరుస్తూ గూడు కట్టుకుంటాయి. ఈత చెట్లపైన వేరే రకం జాతి పక్షులు బోర్లించిన సీసా మాదిరి గూడు అల్లుకుంటాయి. కాకులు, గద్దలు చెట్ల మీద ఆ పుల్ల, ఈ పుడక తెచ్చి గూళ్ళు కట్టుకుంటాయి.కానీ మట్టితో  కూడా పక్షులు అందమైన గూడును నిర్మించడం అనేది అరుదు. సాధారణంగా  కందిరీగలు ఇంటి గోడల మీద గూళ్ళు నిర్మించడం చూస్తుంటాం. చీమలు పుట్టలు నిర్మించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ పక్షులు కూడా మట్టితో గూడు నిర్మించడం అనేది విచిత్రమే. మట్టితో ఈ పక్షులు వాటి పిల్లలు,గుడ్లను పొదిగేందుకు అవసరమైన నివాసాన్ని చాలా అద్భుతంగా నిర్మించాయి. ఇక్కడ ఓ పిచుక తన తోటి పిచుకతో కలిసి  మట్టితో అందమైన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని తన గూడులో హాయిగా సేద తీరుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి మీరు కూడా ఈ అందమైన పక్షి మట్టి గూడును చూడండి.