తల్లీ నేనే గెలవాలి… ఈవీఎంకు బీజేపీ మంత్రి అగరబత్తీలు, టెంకాయతో పూజలు.. - MicTv.in - Telugu News
mictv telugu

తల్లీ నేనే గెలవాలి… ఈవీఎంకు బీజేపీ మంత్రి అగరబత్తీలు, టెంకాయతో పూజలు..

November 22, 2018

‘అమ్మా ఈవీఎం లక్ష్మీ… ఈసారి నేను తప్పకుండా గెలవాలి. ఇందులో పడ్డ ఓట్లన్నీ నావైపే మారేలా చూడు తల్లీ. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిన్ను నా ఇలవేల్పును చేసుకుంటాను..’ చిత్రంగా వుందే. ఎవరైనా ఈవీఎం మెషీన్‌ను అమ్మవారిగా పూజిస్తారా? అని అనుకుంటున్నారు కదూ. కానీ, ఒకాయన అనుకున్నాడు అలా. ఏకంగా ఈవీయమ్మకు అగరబత్తులు వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి మొక్కుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

చత్తీస్‌గఢ్‌లో మలివిడత పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడి పోలింగ్ బూతులోనే ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. రాష్ట్ర పర్యాటక మంత్రి దయాళ్ దాస్ భాగేల్, నవాఘడ్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన, ఈవీఎం తప్ప తనను ఈ ఎన్నికల్లో తనను నిలబెట్టేది ఏదీ లేదని భావించినట్టున్నాడు. అందుకే ఇంకాసేపైతే ఓట్లు ప్రారంభమవుతాయనగా లోపలికి వెళ్ళారు. ఈవీఎంకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయకొట్టి, అగరుబత్తీలు వెలిగింది, ఇంకోసారి విజయలక్ష్మి తననే వరించాలని మొక్కాడు. అంతా అయ్యాక అతను చిక్కుల్లో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఈసీ వెంటనే అతనికి నోటీసులు జారీ చేసి, సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దయాళ్ దాస్ బాగేల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన సమాధానం చెప్పగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్రత్ సాహూ తెలిపారు.