mictv telugu

హైదరాబాద్, సికింద్రాబాద్ పేర్లు మార్చేస్తాం.. రాజాసింగ్

November 8, 2018

దేశంలో పేర్ల మార్పు ‘ఉద్యమం’ మొదలైంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలో పలువురు నేతలు పయనిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ పేర్లను హిందూ పేర్లుగా మార్చేస్తామని పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. మొగల్ రాజులు, నిజాంల పేరిట ఉన్న పేర్లన్నీ తొలగిస్తామని, దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లను పెడతామని చెప్పారు.

rrtt

ఆయన ఈ రోజు మీడియాతో మాట్టాడుతూ…‘ఎన్నికల్లో మేం అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తాం. అంతేకాదు, సికింద్రాబాద్, కరీంనగర్‌ల పేర్లు కూడా మారిపోతాయి. దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వారి పేర్లు పెడదాం. హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరం. 1590లో కులీ కుతుబ్ షా దాన్ని హైదరాబాద్ అని మార్చేశాడు. మనం మన పాత పేర్లను మళ్లీ పెట్టుకోవాలి. యోగి ఆదిత్యానాథ్ ఫైజాబాద్ పేరును శ్రీఅయోధ్యగా మార్చేసి మంచిపని చేశారు. ఇది కేవలం పేర్ల మార్పు వ్యవహారం కాదు. కోట్లాది మంది హిందువులు డిమాండ్’ అని అన్నారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, వచ్చాక తమ మొదటి పని హైదరాబాద్ పేరు మార్చడమేనని పేర్కొన్నారు.

Telugu news BJP Ex MLA Hindu leader Raja Singh announces rename Hyderabad as Bhagyanagaram if party win assembly election