mictv telugu

అగ్రకులాలకు కోటాపై బీజేపీలో అసమ్మతి సెగ

January 7, 2019

అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై ఆయన సొంత పార్టీ నుంచే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు బాహాటంగానే మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. సామర్థ్యాన్ని చాటుకోడానికి రిజర్వేషన్లు అవసరం లేదని లేదని పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Telugu news bjp leaders against modi decision to reservation upper castes gadkari says Indira Gandhi Proved Herself In Her Party Without Quota

ఆయన ఈ రోజు నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘నేను మహిళలకు కోటాను సమర్థిస్తాను. అయితే కులాలు, మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తాను. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తన సత్తాను చాటుకోవడానికి ఆమెకు రిజర్వేషన్లు అవసరం లేకపోయాయి. కాంగ్రెస్‌లోని పురుష నేతలకంటే బాగా రాణించారు.. మనుషులు వారి నాలెడ్జి కారణంగానే రాణిస్తారు, భాష, కులమతాలు, ప్రాంతాల ఆధారంగా కాదు’ అని అన్నారు. రాజకీయాల కోసం చేసే కుల రాజకీయాలను తాను వ్యతిరేకిస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఓడిన నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని ప్రకటించాలని ఆరెస్సెస్, బీజేపీలోని మోదీ వ్యతిరేక వర్గాలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తుండడం తెలిసిందే.

Telugu news bjp leaders against modi decision to reservation upper castes gadkari says Indira Gandhi Proved Herself In Her Party Without Quota