నూతన వధూవరులకు బీజేపీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

నూతన వధూవరులకు బీజేపీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్

April 11, 2018

ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చిందల రామచంద్రారెడ్డి కాబోయే వధూవరులకు తీపి కబురు వినిపించారు. పేదింటి ఆడపిల్లల పాలిట తాను ఒక కుటుంబసభ్యుడిగా వుంటానని తెలిపారు. పుట్టింటి సారెలా ఈ పథకం రూపొందించినట్టు తెలిపారు.  పెళ్ళికూతురికి తులం బంగారంతో పుస్తెలు, పెళ్ళి కుమారుడికి ఉంగరం అందిస్తానని చెప్పారు. అలాగే వాటికి తోడు రెండు తులాల బరువైన వెండి మెట్టెలు, నూతన వస్త్రాలతో కూడిన కిట్‌ను ఇస్తామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తానని అన్నారు.పెళ్లి సమయంకన్నా ముందే ఈ కిట్‌ను అందిస్తామని, లబ్దిదారుల ఎంపిక డివిజన్ బీజేపీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో మహిళా మోర్చా కార్యకర్తలు మేళతాళాలతో వచ్చి, అందరి సమక్షంలో ఈ కానుకను ఇస్తారని చెప్పారు. ఇందుకోసం తమ వివాహ పత్రికను, ఆధార్ కార్డుతో జతచేయాలని సూచించారు. ప్రజలతో మమేకం అయ్యేలా ఈ పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. నాయకుడు అంటే వారి కుటుంబ సభ్యుడిగా వుండాలని ఈ పథక రూపకల్పన చేసినట్టు తెలిపారు.