దళిత మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దాడి - MicTv.in - Telugu News
mictv telugu

దళిత మహిళపై బీజేపీ ఎమ్మెల్యే దాడి

March 12, 2018

ఆయన తాను  ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మర్చిపోయాడు. కులాల జోలికి వెళ్ళకూడదు, మహిళలను గౌరవించాలనే కనీస విజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించాడు. దళిత మహిళపై చేయి చేసుకోవడమే కాదు, కులం పేరుతో వారిని దూషించాడని బీజేపీ ఎమ్మెల్యే  రాజ్‌కుమార్‌ థూక్రాల్‌‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై ఉత్తరాఖండ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరఖండ్ రుద్రాపూర్‌లో వుండే దళిత కుటుంబాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు తిరస్కరించటంతో పారిపోయారు. దీంతో ఆ ఇంటి పెద్దలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. ఇది తన నియోజక వర్గం ప్రజల సమస్య అనుకున్న సదరు ఎమ్మెల్యే వారిమధ్య సంధి కుదర్చటానికి తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో వారు ఆయన ముందే వాదులాడుకోగా.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే మహిళలను దూషిస్తూ చెయ్యి చేసుకున్నారు. ఎమ్మెల్యేగారి తీరుపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.