జామా మసీదు జమునాదేవి గుడి అంట! - MicTv.in - Telugu News
mictv telugu

జామా మసీదు జమునాదేవి గుడి అంట!

December 7, 2017

తాజ్ మహల్ తేజో మహాలయం అని సాగుతున్న ప్రచారం సద్దుమణగక ముందే మరో వాదన మొదలైంది. ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు కూడా ఒకప్పుడు హిందూ దేవాలయమే అని అంటోంది బీజేపీ.. జామా మసీదు ఒకప్పుడు జమునా దేవీ ఆలయం అని, దాన్ని కూల్చేసి మసీదు కట్టారని బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ చెప్పారు.మెుగల్ చక్రవర్తులు సుమారు 6వేల స్థలాల్లోని ఆలయాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ పూర్వకంగానే  అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండంతో వినయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజ్ మహాల్ ఒకప్పుడు తేజో మహాలయం అని చెప్పింది కూడా వినయ్ కతియారే. దీనికి పక్కాగా ఆధారాలు ఉన్నాయని అన్నాడు. అయితే ఇది హిందూ గుడి అని చెప్పే ఆధారాల్లేవని భారత పురాతత్వ శాఖ.. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫడవిట్లో పేర్కొంది.