క్రైస్తవులను ఉచితంగా జెరూసలేంకు పంపిస్తాం.. బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

క్రైస్తవులను ఉచితంగా జెరూసలేంకు పంపిస్తాం.. బీజేపీ

February 15, 2018

హజ్ సబ్సిడీలు క్రైస్తవ  మిషనరీలకు నిధులు.. మైనారిటీలను బుజ్జగించడానికే అని విరుచుకుపడే బీజేపీ రూట్ మార్చింది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సిద్ధాంతాలకు విరుద్ధమైన హామీని ఇచ్చి కలకలం రేపింది. తాము అధికారంలోకి వస్తే కైస్తవులను వారి పుణ్యక్షేత్రమైన జెరూసలేంకు ఉచితంగా పంపిస్తామని ప్రకటిచింది.ముస్లింలకు హజ్ సబ్సిడీని రద్దు కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఈ హామీ ఇవ్వడం గమనార్హం. అయితే క్రైస్తవులకు ఇచ్చిన  ఆఫర్  కేవలం నాగాలాండ్ రాష్ట్రానికేనా,  లేకపోతే మిగతా ఈశాన్య  ఇతర రాష్ట్రాలకు, దేశంలోని ఇతర  క్రైస్తవులకు కూడా వర్తిస్తుందా అనే దానిపై కాషాయదళం వివరణ ఇవ్వడం లేదు.  త్వరలో జరగనున్న మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ హామీని బీజేపీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తున్నది. మేఘాలయలో 75శాతం జనాభా, నాగాలాండ్‌లో 88 శాతం జనాభా క్రైస్తవులు ఉండటం వలనే  ఈ నిర్ణయం తీసుకుంది.