ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ వంద కోట్ల ఆఫర్ .. దిగ్విజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ వంద కోట్ల ఆఫర్ .. దిగ్విజయ్

January 9, 2019

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా కావడం లేదు అప్పడే ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్‌ త్రిపాఠి… సబల్‌ఘర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్‌ నేత బాజీనాథ్‌ కుశ్వాహను కలిశారు. అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్‌ మిశ్రా, విశ్వాస్‌ సారంగ్‌ బాజీనాథ్‌తో మాట్లాడారు.Telugu News bjp party trying to collapse kamalanath government in madhya pradesh says congress senior leader digvijay singhఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పారు. కానీ బాజీనాథ్‌ వీటిని తిరస్కరించారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’  అని దిగ్విజయ్ తెలిపారు.

కాగా, దిగ్విజయ్‌ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్‌కు అలవాటేనని, ఆయనో ‘గాసిప్‌ మాంగర్‌’ అని విమర్శించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీయే కాబట్టి మీటింగ్‌ జరిగిందని చెబుతున్నా దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తెచ్చి వీటిని నిరూపించాలని సవాల్‌ విసిరారు.Telugu News bjp party trying to collapse kamalanath government in madhya pradesh says congress senior leader digvijay singh