తెలంగాణలో బీజేపీ స్పెషల్ టీమ్స్..అమిత్‌షా వ్యూహం ఏంటి? - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో బీజేపీ స్పెషల్ టీమ్స్..అమిత్‌షా వ్యూహం ఏంటి?

March 7, 2018

ఇప్పటికే 22 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకున్న కమలం పార్టీ తెలంగాణ లో కూడా అధికారంలోకి రావాలని వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. త్రిపురలో విజయఢంకా మోగించిన బీజేపీ నజర్ ఇప్పుడు తెలంగాణపై పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ పార్టీ చీఫ్ అమిత్ షానే స్వయంగా రంగంలోకి దిగారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దెందుకు స్పెషల్ టీములను అమిత్‌షా రంగంలోకి దింపారు.  ఈ స్పెషల్ టీమ్స్ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను రహస్యంగా బీజేపీ అధిష్టానానికి చేరవేస్తోంది. అంతేకాదు మరి కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రుల బృందం,ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసిన టీమ్స్ కూడా తెలంగాణలో ప్రత్యేక దృష్టి సారించనున్నాయి.

అమిత్ షా పార్టీ నేతలతో మాట్లాడుతూ ‘ టిఆర్ఎస్ తో పొత్తు అనే ముచ్చటనే ఉండదని స్పష్టం చేశారు. అంతే కాదు పొత్తు గురించి ఆలోచించే నేతలు పార్టీ వీడి వెళ్లాలని అన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ నుంచి కీలక వికెట్ కూడా బీజేపీ గూటికి రాబోతుందని అమిత్ షా అన్నారు. 2019 లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మీ పని మీరు చేయండి,మిగతాది నేను చూసుకుంటా అని నేతలకు అమిత్ షా భరోసా ఇచ్చినట్లు సమాచారం. 2 శాతం ఓట్ల నుంచి త్రిపురలో అధికారంలోకి వచ్చామని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని  పనిచేయాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.