mictv telugu

బీజేపీ పార్టీ అమెరికా, ఇంగ్లాండ్ లోను గెలుస్తుంది.. ఉద్దవ్ ఠాక్రే

February 11, 2019

శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే బీజేపీ పార్టీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మన దేశంలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను వాడుతూ లండన్, అమెరికాలో ఎన్నికలు పెడితే అక్కడ కూడా బీజేపీ పార్టీ గెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే, అవకాశం వచ్చినప్పుడల్లా కమలం పార్టీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండే శివసేన, తాజాగా తమ పార్టీ అధికార ‘సామ్నా’ సంపాదకీయంలో బీజేపీ అతి విశ్వాసం త్వరలోనే కనుమరుగై, అసలు నిజం తెలిసివస్తుందని అభిప్రాయపడింది.Telugu News bjp wins in america and england if they contest elections with our country evms says shiv sena supremo uddhav thakre ఇవే ఈవీఎంలను వాడుతూ ఎన్నికలు జరిపితే ఎక్కడైనా బీజేపీ విజయం సాధిస్తుందని సెటైర్లు వేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించిన పత్రిక, ఈ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 43 గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, రానున్న ఎన్నికల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన మహారాష్ట్ర ప్రజలు, ఇప్పుడు పురాలోచించుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. లేకుంటే ఇప్పటివరకూ స్నేహితులుగా ఉన్నవారంతా దూరం అవుతారని హెచ్చరించింది.