రెండు చోట్లా...విచ్చుకున్న కమలం - MicTv.in - Telugu News
mictv telugu

రెండు చోట్లా…విచ్చుకున్న కమలం

December 18, 2017

ఎట్టకేలకు ఇటు గుజరాత్, అటు హిమాచల్ ప్రదేశ్ లలో బీజీపీ తన విజయకేతనం ఎగురవేసింది. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాల్లో వందకు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ లోని 68 స్థానాల్లో  దాదాపు 40 కిపైగా స్థానాలను కైవసం చేసుకుంది. గుజరాత్ తో ఆరోసారి అధికారం బీజేపీ వశమైంది. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు మొదట తారుమారయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఒక దశలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత కనబరిచినా, మళ్లీ వెనుకబడిపోయింది. ఈ ఎన్నికల్లో పటేళ్ల రిజర్వేషన్ల అంశం కీలక పాత్ర పోషిస్తుందని అందరూ భావించారు. హార్థిక్ పటేల్ నేతృత్వంలోని పాటీదార్ అనామత్ ఆందోళన సమితి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని భావించారు. అయితే పటేళ్ల ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముందంజలో కొనసాగడం విశేషం.