నల్లకోడి కావాలా నాయనా...కిలో వెయ్యి రూపాయలే! - MicTv.in - Telugu News
mictv telugu

నల్లకోడి కావాలా నాయనా…కిలో వెయ్యి రూపాయలే!

December 17, 2017

ఏంటిది కోడికి బొగ్గు గిట్ల పూశిండ్రా ఏంది అని అనుకునేరు. దీని రూపమే అంత.  ఈకోడిపేరు కడక్ నాథ్…మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి. మధ్యప్రదేశ్ లోని  ఆదివాసీ రైతులంతా ఈనల్లకోళ్ల పెంపకాన్ని వాళ్ల ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. దీ నికి గిరాకీ కూడా ఎక్కువే.

ఎందుకంటే మనకు తెలుసు బాయిలర్ కోడికంటే నాటుకోడి ఎంత రుచిగా ఉంటుంద. అయితే ఆనాటుకోడి కంటే ఈనల్లకోడి ఇంకా రుచిగా ఉంటుంది. వేరే కోళ్లకంటే వీటిలో ప్రోటీన్ల శాతం కూడా ఎక్కువే,ఐరన్ శాతం మిగతా కోళ్లకన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటుంది.

అంతేకాదు ఈకోడిని తినడం వలన  గుండెజబ్బు, క్షయ, ఆస్తమాలతో పాటు తీవ్రమైన తలనొప్పి, ఫిట్స్‌ రోగులకీ మంచి ఫలితాన్ని ఇస్తుందట. అందుకే ఈకోడి కిలో ధర 800 నుంచి 1000 రూపాయలకు వరకు ఉంటుంది. ఒక్కో గుడ్డు ధర రూ.40 నుండి రూ.50 వరకు ఉంటుందట. వీటికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా  చాలామంది వీటిని పెంచుతున్నారు.