ప్రాజెక్టులను అడ్డుకోవడంలో వైఎస్సార్‌సీపీకి జనసేన తోడైంది - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాజెక్టులను అడ్డుకోవడంలో వైఎస్సార్‌సీపీకి జనసేన తోడైంది

March 20, 2018

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని, సీబీఐ విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ అన్న విషయం తెలిసిందే. ‘ ఇప్పటివరకు ప్రాజెక్టులను అడ్డుకోవటంలో వైఎస్సార్ పార్టీయే ముందుండేది. ఇప్పుడు దానికి జనసేన కూడా తోడైంది. పూర్తి పారదర్శకతతో సాగుతున్న పోలవరం పనుల్లో అవినీతిపై పవన్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ? బీజేపీ నేతల ప్రోద్బలంతోనే పవన్ రెచ్చిపోతున్నారు ’ అని విరుచుకుపడ్డారు.ప్రభుత్వంపై ఉద్దేశ పూర్వకంగానే బురదజల్లే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ధైర్యముంటే ఒక్క ఆధారాన్ని బయట పెట్టాలని సవాల్ విసిరారు.‘ రాష్ట్రంలో నిర్మితమవుతున్న ఏ ప్రాజెక్టులోనూ అవినీతి జరగటంలేదు.. పవన్‌వి నిరాధార ఆరోపణలు మాత్రమే.. నేను అవినీతికి వ్యతిరేకిని అన్న విషయం వాళ్ళు తెలుసుకుంటే మంచిది ’ అని తెలిపారు.