ప్రధానికి, రాష్ట్రపతికి దళితుల నెత్తుటిలేఖ.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధానికి, రాష్ట్రపతికి దళితుల నెత్తుటిలేఖ..

April 5, 2018

ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టాన్ని నీరుగార్చే సుప్రీంకోర్టు తీర్పుపై దళితుల ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీ నేతలు రక్తంతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లకు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేస్తే ముందస్తు అరెస్ట్‌లు చేయకూడదంటూ, ఈ చట్టంలో యాంటిసిపేటరీ బెయిల్‌ను సుప్రీంకోర్టు చేర్చింది.దీనిపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. భారత్ బంద్‌కు పిలుపునివ్వగా అదికాస్తా హింసాత్మకంగా మారి.. దేశవ్యాప్తంగా పది మంది చనిపోయారు. చట్టాన్ని నీరుగార్చకూడదని, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి. కాగా ఈ చట్టాన్ని నీరుగార్చే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా.. తమ ఆదేశాలపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. పది రోజుల తర్వాత దీనిపై మరోసారి విచారణ జరపనుంది. అనంతరం భారత్ బంద్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన దళితులకు దళిత్ పాంథర్స్ పార్టీ నేతలు నివాళులు అర్పించారు.