మూడు చంద్రుల  అద్భుత కలయిక రోజు ఏం జరగబోతోంది? - MicTv.in - Telugu News
mictv telugu

మూడు చంద్రుల  అద్భుత కలయిక రోజు ఏం జరగబోతోంది?

January 31, 2018

ఆకాశంలో నెలరాజు ఈ రోజు వింతగా కనిపించనున్నాడు.  సంపూర్ణ చంద్రగ్రహణానికి ముందు చంద్రుడు భూమికి దగ్గరగా జరిగి   నీలి, రక్తవర్ణంతో   కలసిపోయి కనువిందు చేయనున్నాడు. ఇది 150 సంవత్సరాలకొకసారి జరిగే అద్భుతంగా చెబుతున్నారు.

ఇది ఆసియా, ఆస్ట్రేలియా ఉత్తర, మధ్య అమెరికా ఖండాలలో  దృశ్యమానం కానుంది . ఈ సారి సంభవించే మహాచంద్ర త్రయానికి ఇది ఆఖరిది.   ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది ప్రత్యేకంగా కనిపించినా భూమి చుట్టూ చంద్రుడు వృత్తాకారంలో కాక  దీర్ఘ వృత్తాకారంలో అంటే కోడిగుడ్డు ఆకారంలో పరిభ్రమిస్తాడు కాబట్టి ఒక్కోసారి దగ్గరగా ఒక్కోసారి దూరంగా జరగడం మాములుగా జరిగే ప్రక్రియ. భూమికి దగ్గరగా జరిగినపుడు నెలరాజు సుమారు 360, 000 కిలోమీటర్లు దూరంలో  ఉంటే.. దూరం జరిగినపుడు ఇది 406,000 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే మహా చంద్రుడు సుమారు 8 శాతం పెద్దదిగా 15 శాతం కాంతి వంతంగా ఉoటాడు.

మరి ‘బ్లూ మూన్’ (నీలి చంద్రుడు) మాటేమిటి? అసలు చంద్రుడు నీలి రంగులోకి ఎన్నటికీ మారడు కదా. మరి ఈ పేరు ఎలా వచ్చింది అంటే.. మాములుగా పౌర్ణమికి పౌర్ణమికి మధ్య 29. 5 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఒకే నెల రెండు పౌర్ణములు రావడం ౩౦ నెలలకు ఒకసారి  జరుగుతుంది. దీన్ని పొరపాటుగా బ్లూ మూన్ (నీలి చంద్రుడు) అని 1940లలో అనేశారు శాస్త్రవేత్తలు. అదే ఇప్పటికి నానుడిలో ఉంది.  

బ్లడ్‌మూన్ (రక్త వర్ణ చంద్రుడు) ఎర్రటి ధూళి రంగులో ఉన్నప్పుడు ఉపమానంగా చెబుతారు. ఇది బైబిల్‌లో వర్ణించబడిన పేరు. ఇది చంద్ర గ్రహణం సమయంలో జరుగుతుంది. చంద్రుడు సూర్యునికి  దూరంగా జరిగినపుడు  భూమికి సూర్యునికి  సమాంతరంగా వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుని మీద పడి మసకబారిపోతాడు. అప్పుడు భూమి ఉపరితలం మీద పడిన సూర్యకాంతి పరివర్తనం చెంది, చంద్రుని మీద పడి కాంతి ఎక్కువ తరంగ దైర్ఘ్యంలో పరివర్తనం చెంది ఎరుపు ధూలి రంగు సంతరించుకుంటుంది. అదే చంద్రుడి మీద పడి మనకు రక్త చంద్రడుగా కనిపిస్తాడు. ఈ శతాబ్దంలో సుమారు 85 సార్లు ఇలా జరిగినట్టు అంచనా.

చంద్ర గ్రహణం జరిగినపుడు కాంతి ఒక ఉపరితలం మీద పడినపుడు ఎంత మొత్తంలో ఎలా పరివర్తనం చెందుతుంది అనే విషయాలతో పాటు దీని ప్రభావం వలన భూమ్మీద బద్దలయ్యే అగ్నిపర్వతాలు, ఉల్కాపాతం లాంటి వాటికి ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

భూమికి దూరంగా ఉండే కోట్ల నక్షత్రాల కాంతుల స్వభావాన్ని బట్టి అది ప్రసరించిన గ్రహాలూ దాని మీద ఉండే ధూళి కణాల స్వభావాల్ని అంచనా వేసే అవకాశం ఉంది. ఆ గ్రహాల మీద ఉండే ఆక్సిజన్ నత్రజని లాంటి  వాయువులు కాంతి స్వభావాన్ని నిర్దేశిస్తాయి. అందుకే  ఖగోళ శాస్త్రానికి సంబంధించినoత వరకు ఇది ఒక నిరంతర అధ్యాయన అంశం. మిగితా వారికి  అదొక నయనానందం. దాబా లెక్కి అలా చంద్రుని సొగసుని చూస్తూ ప్రియురాలి చెక్కిళ్ళ మీద కాంతులీనే సోయగం మీద కవితలు అల్లుకోవచ్చు. ఓ నెలరాజా అంటూ  పాటలు పాడుకోవచ్చు.

మరి మన పామర పండిత వర్గాలకి అది ఒక అంతు చిక్కని బూచి. దుశట చతుశటయానికి భలే మంచి సమయం కాబట్టి క్షుద్ర  పూజలు గట్రా చేసుకోవచ్చు. అయ్యవార్లు వాటి ప్రభావం తగ్గించడానికి యాగాలు గట్రా చేయించి  భుక్తి పొందచ్చు.  గర్భవతులు బయటికి రాకండోయి. ఏమైనా జరగరానిది జరిగితే డాక్టర్లు బాధ్యత వహించరు  మరి. ఆ సమయానికి  పుట్టినోల్లు  మాత్రం  లోక కంఠకులో మరోటో అయిపోతారు. ఆలయాల తలుపులు  మూసేస్తారు. పుజార్లు  దేవుడికి నైవేద్యo కూడా పెట్టక పస్తులు ఉంచుతారు. దోషం అంటుకుంటుంది మరి. దేవుడికి కుడా తప్పదు. దుశ్శకునo దుశ్శకునo…  హచ్.. సత్యం.. సత్యం.

మరైతే ఈ రోజు బామ్మరిది భాం..మరిది ఐపోడు. మరదలు వరస అసలే  మారిపోదు. బావ మీది భావ ప్రకటనకేమి లోటు ఉండదు. మొగుడు పెళ్లాల కీచులాటలు, చాటు మాటు సరసాలకేం కొదువ ఉండదు. అమంగళం ప్రతిహతమగుగాక.  తాగుబోతు సచ్చినోళ్ళు తూలడం  మానుకోరు. ఎందుకంటే మందు షాపులు తెరుచుకునే ఉంటాయి కాబట్టి. పునుగులు, వడలు అదే సైజుల్లో ఉంటాయి తప్పితే బొండాలు బజ్జీలు  లాగ మారిపోవు. వర్మ తాజా సినిమా ‘జీఎస్ టీ’  ప్రభావం యువత మీద పడోచ్చూ లేక పడక పోవచ్చు. అదే వర్మ తీసిన  దయ్యాల సినిమాలో మాదిరి  కులాయిలో నీళ్ళ రంగు మారిపోయి రక్త వర్ణంలోకి మాత్రం రావు…అదేo చోద్యమో…..    

 

చంద్ర మోహన్-