‘ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ.. మనీ ఈజ్ ఆల్వేస్.. అల్టిమేట్’ అనే డైలాగ్‌తో తాజాగా విడుదలైంది ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా టీజర్. జ్యోతిలక్ష్మr, ఘాజీ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేశ్ పిళ్ళై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా ఫేం నందితా శ్వేతా హీరోయిన్గా నటిస్తోంది. మనిషికి ఆశ సహజం. అది అత్యాశగా మారినప్పుడు నేరాలు, ఘోరాలు జరుగుతాయనే పాయింటును బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుందట.
అత్యాశ వున్నచోట ఒక బ్లఫ్ మాస్టర్ వుంటాడనే నేపథ్యంలో సినిమా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు సత్యదేవ్ నటన ప్లస్ అంటున్నారు.అతడు హీరోగా నటించిన ‘గువ్వ గోరింక’ సినిమా కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. సునీల్ కాశ్యప్ సంగీతం అందించిన బ్లఫ్ మాస్టర్‌లో ఆదిత్యా మీనన్, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, చైతన్య కృష్ణ, ధన్‌రాజ్, శ్రీరామరెడ్డి, వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్, బన్నీ చందు, దిల్ రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-హెచ్.డి.వినోద్, అడిషనల్ డైలాగ్స్-పులగం చిన్నారాయణ అందిస్తున్నారు.