అనిల్‌కపూర్ ఆఫీసును కూల్చేసిన ముంబై మున్సిపాలిటీ - MicTv.in - Telugu News
mictv telugu

అనిల్‌కపూర్ ఆఫీసును కూల్చేసిన ముంబై మున్సిపాలిటీ

November 28, 2017

బాలీవుడు నటుడు అనిల్ కపూర్‌కు ముంబై మున్సిపాలిటీ షాకిచ్చింది. నగరంలోని శాంతాక్రజ్ వెస్ట్ దత్తాత్రే రోడ్డుపై ఉన్న ఆయన ఆఫీసులో నిబంధనలకు విరుద్దంగా గ్లాసు, చెక్కలతో క్యాబిన్లు కట్టారు. దీనిపై ఇంతకు ముందే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనిల్ కపూర్‌కు నోటీసులు ఇచ్చారు.

అనిల్ కపూర్ విదేశీపర్యటనలో ఉండి మున్సిపాలిటీ వాళ్లు ఇచ్చిన నోటీసులకు స్పందించక పోవడంతో.. అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. గతంలోనూ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు సంబంధించిన క్యాంటీన్‌ను అక్రమంగా కట్టడంతో  మున్సిపాలిటీ వాళ్లు కూల్చివేశారు. ముంబైలో అక్రమ నిర్మాణాలపై  ముంబై మున్సిపాలిటీ  ఎవ్వరినీ లెక్కచేయకుండా కఠినంగా వ్యవహరించడంపై  చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు