వెనిస్ నగరం కాదు…విశ్వ నగరమే..!

చుట్టూ ఇల్లు, ఇళ్ల మధ్యలో పడవ ప్రయాణం, ఆహా  ఎక్కడిదో ఈ సుందర దృశ్యం, బహుశా ఇటలీ దేశంలోని వేనీస్ నగరంలోనిదే  అనుకునెరు, కాదు ఇది మనదేశంలోనే.  విశ్వ నగరంగా  తీర్చుదిద్దుతామని  చెప్తున్న  మన హైదరాబాదే. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, హైద్రాబాద్ లోని రామాంతపూర్   వేనీస్ నగరంగా మారిపోయింది. లాహిరి, లాహిరి లాహిరిలో  అంటూ పబ్లిక్ ఇలా పడవలపై ప్రయాణం చేస్తున్నారు. వరుస వర్షాలుతో  ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్‌ జామ్‌లు, చెరువులను తలపిస్తున్న రోడ్లు, నీటమునిగిన కాలనీలు,  చూస్తుంటే  పాలకులు చెప్పినట్టు  తొందరలోనే హైద్రాబాద్  విశ్వనగరంగా మారబోతుందన్నమాట.

SHARE