సాగర్ నుంచి శ్రీశైలంకు లాంచీ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

సాగర్ నుంచి శ్రీశైలంకు లాంచీ షురూ

November 1, 2017

నీళ్ల మీద ఆరు గంటల ప్రయాణం. నాగార్జున సాగర్ దగ్గర మొదలైన ప్రయాణం శ్రీశైలం వెళ్లేదాకా ఆగదు. నాగార్జునసాగర్‌ – శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణానికి రంగం సిద్ధమైంది.  నవంబర్ 1 నుంచి లాంచీ  ప్రయాణానికి తెలంగాణ టూరిజం శాఖ  శ్రీకారం చుట్టింది.

ఉదయం 10 గంటలకు  లాంచీ నాగార్జున సాగర్ నుండి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుతుంది. అక్కడికి వెళ్లగానే పర్యాటకులకు బస కల్పించి, మరుసటి రోజు  ఉదయం దైవదర్శనం చేయిస్తారు. ఆ తర్వాత అక్కడి దర్శనీయ ప్రదేశాలు చూపించి, తిరిగి ఉదయం 10 గంటలకు  లాంచీ బయలుదేరి, సాయంత్రానికి కల్లా నాగార్జున సాగర్‌ చేరుకుంటుంది.  సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు మాత్రమే వెళ్లే పర్యాటకులైతే.. పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఓ ప్యాకేజీ కింద రూ.3800గా టూరిజం నిర్ణయించింది.