అక్షయ్.. నువ్వు గ్రేట్.. అమరవీరుల కుటుంబాలకు 29 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అక్షయ్.. నువ్వు గ్రేట్.. అమరవీరుల కుటుంబాలకు 29 కోట్లు

April 10, 2018

దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓ గొప్ప  కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఏడాది ‘భారత్ కేవీర్ ’ పేరుతో వెబ్‌సైట్, యాప్‌ను తీసుకొచ్చాడు. దీని ద్వారా వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఎవరైనాసరే విరాళం అందించవచ్చు.

నిన్నటితో అక్షయ్ యత్నానికి ఏడాది పూర్తయింది. ఈ  యాప్ ద్వారా ఇప్పటివరకు రూ. 29 కోట్ల విరాళం సేకరించి, 159 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉందని అక్షయ్ తెలిపారు. మీ ఆదరణ ఎప్పుడూ ఇలానే  అందిస్తూ ఉండాలని కోరుతూ.. వెబ్‌సైట్ ఐడీనీ www.bharatkeveer.gov.in అడ్రస్ చెప్పారు. గతంలో కూడా  అక్షయ్ ముంబైలోని బీచ్‌లోని స్థానికుల అవస్థలు చూసి తట్టుకోలేక 10లక్షలతో టాయ్‌లెట్ కట్టించాడు.

అక్షయ్‌  ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ప్యాడ్‌మ్యాన్‌’తో హిట్‌ అందుకున్నాడు. ప్రతినాయకుడిగా నటించిన ‘2.ఓ’ విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ఆయన ‘గోల్డ్‌’, ‘మొఘల్‌’, ‘కేసరి’ సినిమాల్లో నటిస్తున్నారు.