జాబ్ కోసం దరఖాస్తు పెట్టుకున్న అమితాబ్‌! - MicTv.in - Telugu News
mictv telugu

జాబ్ కోసం దరఖాస్తు పెట్టుకున్న అమితాబ్‌!

February 19, 2018

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏంటి అమితాబ్‌కు జాబా అని ఆశ్యర్యపోతున్నారా ?  ఆయన అప్లై చేసిన జాబ్  ఏమిటింటే .. పొడుగ్గా ఉండే హీరోయిన్ల పక్కన నటించడం కోసం తనదైన శైలిలో స్పందించాడు.అమీర్ ఖాన్, షాహిద్ కపూర్ లాంటి పొట్టి హీరోల పక్కన నటించడం , పొడుగ్గా ఉండే దీపికా పడుకొనె, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లకు కష్టంగా మారిందని ఓ పత్రిక వార్తను ప్రచురించింది. దీనికి  బిగ్‌బి.. తన బయోడేటాతో ‘ నేను ఇప్పటికీ  అందుబాటులో ఉన్నాను. ఎత్తు ఎప్పటికీ సమస్య కాదు.. నేను అలహాబాద్‌లో 1942లో పుట్టాను. వయసు 76 ఏళ్లు. 49 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. దాదాపు 200 సినిమాలు చేశాను. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉంటాను. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ భాషలు మాట్లాడతాను  ’ అంటూ తన బయోడేటాను జోడిస్తూ ట్వీట్ చేశాడు. దీపిక, కత్రినా లాంటి పొడగరి హీరోయిన్లతో కలిసి నటించడానికి ఆసక్తిగా ఉన్నానని 76 ఏళ్ల అమితాబ్ చెప్పారు.

కాగా ‘ మీతో నటించే ఛాన్స్‌ను ఏ హీరోయిన్ మాత్రం కాదనుకుంటుంది బచ్చన్‌జీ ’ అంటూ నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు.