అనుపమ్ ఖేర్‌కు కీలక పదవి 

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. బాలీవుడ్‌లో విభిన్న పాత్రల్లో నటించిన ఆయనను ఫిలిం ఆండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా నియమించారు.  పూణేలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రస్తుతం బుల్లితెర నటుడు గజేంద్ర చౌహన్ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో అనుపమ్ ఖేర్‌కు బాధ్యతలు అప్పగించారు. అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్‌గా వ్యవహరించారు. అనుపమ్ దాదాపుగా 500 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అనుపమ్ కళారంగానికి చేసిన సేవాలకు గాను భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది.  గజేంద్ర చౌహన్ చైర్మన్‌గా నియమించడంలో రాజకీయ ఒత్తడి కారణంగానే జరిగదంటూ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ఆందోళన చేయడంలో మార్చిలోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అనుపమ్ నియామకంపైనా విమర్శలు వస్తున్నాయి. ఆయన బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్‌కు భర్త కావడం, బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎప్పుడూ పొడుగుతూ ఉన్నందుకే ఈ పదవి కట్టబెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనుపమ్ కంటే గొప్పనటులు, సినీ దిగ్గజాలు చాలా మంది ఉన్నారని, వారిని పక్కనబెట్టి తమకు బాకా ఊదే అనుపమ్ కే ఈ పదవి అప్పగించారని ధ్వజమెత్తుతున్నాయి.

SHARE