బాలీవుడ్ హీరోపై తాగుబోతు దాడి - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ హీరోపై తాగుబోతు దాడి

December 7, 2017

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌పై  ఓ వ్యక్తి దాడి చేశాడు. యస్.. అయితే  సినిమాలో కాదు నిజ జీవితంలోనే.  ఓ వ్యక్తి ఫుల్‌గా తాగేసి  సినిమా సెట్‌లోకి వచ్చి దాడి చేశాడు. ఈ సంఘటనతో అక్కడే ఉన్న చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ అయింది. అర్జున్ కపూర్ ప్రస్తుతం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ మూవీ చిత్రీకరణ కోసం ఉత్తరాఖండ్‌లోని ఫితోరాఘడ్ పట్టణానికి వెళ్లాడు.అక్కడ చిత్రీకరణ  జరుగుతున్న సమయంలో ఓ తాగుబోతు..  అర్జున్ కపూర్‌కు షేక్ హ్యాండ్  ఇస్తూ ఒక్కసారిగా దాడి చేశాడు.  వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ  వ్యక్తిని పోలీసులకు పట్టించారు. అర్జున్ ‌ దాడి చేసిన వ్యక్తి పేరు కమల్ కుమార్  అని పోలీసుల విచారణలో తేలింది. అతను తాగి  సినిమా  చిత్రీకరణ జరిగే ప్రదేశానికి వచ్చిందుకు, మద్యం తాగి కారు నడిపినందుకు జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. కానీ  అర్జున్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఎటువంటి కేసు పెట్టలేదు.