దీపిక పెద్ద మనసు

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొణె మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. ఆమె మంగళవారం కర్ణాటక దావణగెరె జిల్లాలోని పల్లాగట్టె, బిళిచోడు గ్రామాల్లో పర్యటించి మానసికంగా అనారోగ్యానికి గురైన చిన్నారులను పరామర్శించారు. ప్రజల్లో  మానసిక అనారోగ్యంపై చైతన్యం నింపేందుకు ఆమె స్థాపించిన ‘లివ్ లవ్ లాఫ్ ’అనే ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించింది.ఆ రెండు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులు పడుతున్న  ఇబ్బందులు గమనించి తన వంతు సాయం చేశారు.  ఏడీపీ సంస్థ నుంచి దీపికా మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం నింపి , ఆయా కుటుంబాలను అదుకునేందుకు ఆమె స్వచ్చందంగా ముందుకు కదలారు. మానసిక రోగులపై శ్రద్ద తీసుకుని వారిని మాములు స్థితికి తీసుకువచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. దీపికా ఆయా గ్రామాల్లో పర్యటించడంతో ఆమెను చూడటానికి జనాలు ఎగబడ్డారు. గ్రామాల్లో పర్యటించి ఆనంతరం దావణగెరెలోని ఓ హోటల్‌కి చేరుకోవడంతో అక్కడ కూడా భారీ ఎత్తున జనం చేరి ఆమెను చేసేందుకు ఎగబడ్డారు.

SHARE