బాలీవుడ్ నటి కల్కి కొక్లిన్ సినిమాల్లో నటించడమే కాదు, సమాజంలోని అంశాలపై ఘాటూగా, పవర్ ఫుల్ గా కూడా మాట్లాడుతుంది. తన సినిమాల్లో సామాజిక సమస్యలని చూసించడమే కాదు, బయట కూడా మాటలలో వాటిని ప్రస్తావిస్తుంది. కల్కి తాజాగా ‘లింగ సమానత్వం'(జెండర్ ఈక్వాలిటి) అంశం మీద మాట్లాడింది. ‘ఇంటి పని అంటే కేవలం ఆడవాళ్ల పని కాదు… అది భార్యాభర్తల పని అంటూ ఘాటూగా స్పందించింది. ఇంటి పనులు, బాధ్యతల్ని భార్యాభర్తలు సమానంగా పంచుకొని చేయాలి. దాంతోపాటు మహిళలకు మాతృత్వపు సెలవులున్నట్టే…. మగవారికి కూడా పితృత్వ సెలవులూ ఉండాలని చెప్పింది ‘. మహిళల ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ….’మహిళలకు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలున్నాయని.. కాని ఆత్మవిశ్వాసం మహిళలలో తగ్గిపొవడం, పెళ్లియ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తున్నారు. ఈ పరిస్థితి మారి మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ‘ తాను కోరుకుంటున్నా అని కల్కి తెలిపింది.
ఇక బాలీవుడ్ గురించి మాట్లాడుతూ….’సినీ పరిశ్రమలో ఎప్పటికైనా కథనే రాజు.. అందుకే కథపైనే దృష్టి పెట్టాలి. రచయితలను మరింత గౌరవించాలని చెప్పింది’. కల్కి చివరగా ‘నేక్ డ్’ అనే లఘు చిత్రంలో నటించింది. ప్రస్తుతం రోట్ ట్రిప్ నేపథ్యంతో రూపోందుతున్న ‘జియా ఔర్ జియాలో’ నటిస్తోంది.