ఆలియాభట్‌కు కత్రినా ట్రైనింగ్  - MicTv.in - Telugu News
mictv telugu

ఆలియాభట్‌కు కత్రినా ట్రైనింగ్ 

October 31, 2017

బాలీవుడ్ కథానాయిక కత్రినా  ఫిట్‌నెస్ విషయంలో చాలా ఖచ్చితంగా  ఉంటుంది. తాజాగా కత్రినా కైఫ్  మరో   కథానాయిక ఆలియా భట్‌తో కసరత్తులు చేయిస్తోంది. సమయానికి ట్రైనర్ రాకపోయేసరికి కత్రినా ట్రైనర్‌గా మారి, ఆలియాతో కరసత్తులు చేయిస్తోంది.

జిమ్ ట్రైనర్‌గా ఆలియాకు సూచనలిస్తున్న ఓ వీడియోను కత్రినా తన సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది. ఇద్దరు భామలు కసరత్తు చేస్తున్న  వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్  చేస్తోంది. కత్రినా ప్రస్తుతం సల్మాన్‌కు జోడిగా‘ టైగర్ జిందా  హై’,లో అమీర్ ఖాన్ కు జోడీగా  ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రాల్లో నటిస్తోంది. ఆలియా భట్ ‘రాజీ’  సినిమాలో నటిస్తోంది.  ఎప్పడు సినిమాలతో బిజిగా ఉండే ఈ అందాల భామలు ఫిట్‌నెస్  విషయంలో చాలా జాగత్రలు తీసుకుంటున్నారు.