మీనాకుమారి గా విద్యాబాలన్! - MicTv.in - Telugu News
mictv telugu

మీనాకుమారి గా విద్యాబాలన్!

August 31, 2017

అలనాటి బాలీవుడ్ నటి మీనా కుమారి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా  తీయాలని బాలీవుడ్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. మెదట  మీనా కుమారి పాత్రకు కంగనా రనౌత్, ప్రియాంక చోప్రాలను అనుకున్నారు. కానీ చివరగా ఈ అవకాశం విద్యాబాలన్ కు దక్కింది.

మీనా కుమారి పాత్రలో విద్యా బాలన్ అయితే చక్కగా  ఒదిగిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ విద్య ఇంకా ఈ బయోపిక్ ఓకే చెప్పలేదు. విద్య నటిస్తున్న ‘తుమారీ సులు’ సినిమా షూటింగ్ పూర్తి అయింది. దాంతో ఆమెకు  చాలా మంచి కథలు వస్తున్నాయట.

విద్య మీనా కుమారి బయోపిక్ లో నటిస్తుందా లేదా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీ 2015 లో నే తెరకెక్కించాలనుకున్నారు. కానీ మీనా కుమారి పాత్రలో కంగనా రనౌత్ ను ఎంపిక చేశారు. కంగనా తన సొదరి పాత్రకు సరిపోదని మీనా కుమారి సోదరుడు అభ్యంతరం చెప్పాడు.  దాంతో సినిమా ఆగిపోయింది.