5 కోట్లమంది కళ్లలో పద్మావతి - MicTv.in - Telugu News
mictv telugu

5 కోట్లమంది కళ్లలో పద్మావతి

October 31, 2017

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం‘ పద్మావతి’. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

 ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పటి నుంచి వివాదాలను ఎదుర్కొంది. దాంతో ఈ చిత్రంపై అప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా విడుదలకు ముందే ట్రైలర్ రికార్డులను బద్దలుకొడుతోంది. అక్టోబర్ 9న విడుదలైన ట్రైలర్‌ను  ఇప్పటివరకు 5 కోట్ల మందికిపైగా చూశారు. ఈ ట్రైలర్‌ను యూ ట్యూబ్,ఫేస్‌బుక్‌లో ఒకేసారి విడుదల చేశారు. రెండింటిలోనూ కలిపి 5 కోట్ల వ్యూస్  రావడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విటర్ ద్వారా తెలిపింది. డిసెంబర్ 1న ‘పద్మావతి’  విడుదల కానుంది.