పద్మావతి పారితోషికం 13 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతి పారితోషికం 13 కోట్లు

November 1, 2017

బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పడుకుణె ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఆమె రేంజ్ అది. సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తీసిన ‘పద్మావతి’ కోసం ఆమె ఏకంగా రూ. 13 కోట్ల పారితోషికం పుచ్చుకుంది. శక్తిమంతమైన ఈ పాత్రకు ఆమే తగినదని భావించి అడిగినంత ఇచ్చేశారు.  దేశంలో ఒక హీరోయిన్ ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు. దీపిక టైటిల్ రోల్ పోషించిన పద్మావతి మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించిన షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌ల పారితోషికం దీపికతో పోలిస్తే చాలా తక్కువని సమాచారం. తనకు ఇంత భారీ రెమ్యునరేషన్ అందడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాగా, బాలీవుడ్ లో దీపిక తర్వాత అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న హీరోయిన్లలో కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, ఆలియా భట్ తదితరులు ఉన్నారు.