సెలబ్రిటీల ఫోటోలకు.. నెటిజన్ల సెటైర్లు...! - MicTv.in - Telugu News
mictv telugu

సెలబ్రిటీల ఫోటోలకు.. నెటిజన్ల సెటైర్లు…!

September 13, 2017

సినీ ప్రముఖులు సరదాగా దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు అప్పుడప్పుడు బెడసికొడుతుంటాయి. మొన్నటికి మొన్న యునిసెఫ్ గుడ్ విల్ రాయబారిగా సిరియా వెళ్లి చిన్నారులతో ఫోటో దిగి షేర్ చేసిన ప్రియాంక చోప్రాను నెటిజన్లు విమర్శించారు. దానికి ఆమె గట్టిగానే సమాధానం చెప్పింది.

ఇప్పుడు ప్రియాంక సోదరి పరిణితి వంతు వచ్చింది. ఆస్ట్రేలియాకు విహారయాత్ర కోసం వెళ్లిన పరిణితి చోప్రా.. ఓ కోలా పిల్ల తో (ఎలుగుబంటి ) ఫోటో దిగి ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేసింది. దానిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నీ ముఖం కూడా ఆ ఎలుగుబంటి లాగానే ఉంది, కాస్త డైటింగ్ చేయడం మానేయి అని విమర్శిస్తున్నారు. పరిణితి అది కోలానా….హార్థిక్ పాండ్యానా అని కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనిపై పరిణితి దగ్గర ప్రస్తావిస్తే ఇలాంటి వ్యాఖ్యలను చూసి నేను నవ్వుకుంటాను అంటూ నవ్వేసింది.