టీ కూడా కొనుక్కోలేని స్థితిలో.. క్షయతో హీరోయిన్.. - MicTv.in - Telugu News
mictv telugu

టీ కూడా కొనుక్కోలేని స్థితిలో.. క్షయతో హీరోయిన్..

March 19, 2018

లోకం తీరే అంత. కాస్త పచ్చగా ఉంటే జనం ఈగల్లా మూగుతారు. తేడా వస్తే చెప్పనంత దూరం పారిపోతారు. బాలీవుడ్ నటి పూజా దడ్వాల్ పరిస్థితి దీనికి ఉదాహరణ ఆమె క్షయ వ్యాధితో చిక్కి శల్యమైపోతోంది. కనీసం కప్పు టీ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేక తల్లడిల్లుతోంది. ఇప్పటి తరానికి తెలియకపోయాన 1990లలో ఆమె బాలీవుడ్ జనానికి సుచిపరిచితురాలే. 1995లో వచ్చిన‘వీర్ గతి’ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు ఆమె జోడిగా నటించింది. ‘హిందుస్థాన్‌’, ‘సింధూర్‌ సౌగంధ్‌’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది.తనను జనం మరిచిపోయినందుకు ఆమె  బాధపడ్డం లేదు. కనీసం ఒక మనిషిగా తనను గుర్తించనందుకే ఆవేదన చెందుతోంది.  ‘నేను సాయం కోసం సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించాను. కానీ కుదరలేదు. నాకు క్షయ ఉందని ఆరు నెలల కిందట తెలిసింది. కనీసం  మీడియా ద్వారానైనా నా గురించి సల్మాన్‌కు తెలిసి సాయం చేస్తాడని ఆశిస్తున్నాను. 15 రోజుల నుంచి ఆస్పత్రిలో ఉంటున్నాను. గోవాలో క్యాసినో మెనేజ్ మెంట్ కోర్సు నేర్చుకున్నాను. ఉన్న డబ్బంతా ఆ కోర్సుకే అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. టీ కొనుక్కోవడానికి కూడా వేరే వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనారోగ్యం గురించి తెలిసి భర్త, బంధువులు నన్ను వదిలి వెళ్లిపోయారు’ అని పూజా  ఆవేదనతో చెప్పింది.