బీచ్‌‌లో చీర కట్టుకుని  తిరగాలా? - MicTv.in - Telugu News
mictv telugu

బీచ్‌‌లో చీర కట్టుకుని  తిరగాలా?

March 9, 2018

బాలీవుడ్ నటి  రాధికా ఆప్టే మరోసారి  సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె గోవా బీచ్‌లో బికినీతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దాంతో ఆమెను నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెట్టారు. ఈ విషయంపై ఓ పత్రికా ఇంటర్వ్యూలో మాట్లాడిన  రాధిక ‘ నేనే ఎప్పటికీ ట్రోల్ ఎందుకు అవుతున్నానో తెలియడం లేదు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.బీచ్ లో కూడా చీర కట్టుకుని తిరగాలని వారు అనుకుంటున్నారా ?’అని ప్రశ్నించింది. తనను విమర్శిస్తున్న వారు ఎవరో తనకు తెలియదని చెప్పింది. అలాంటప్పుడు వారి గురించి  ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్నించింది.‘ ప్యాడ్‌మ్యాన్’ సినిమాలో తన నటనకు సంబంధించి వస్తున్న వార్తలను ఇప్పటివరకు చదవలేదని  తెలిపింది. అయితే తన నటన ప్రేక్షకులకు నచ్చిందన్న విషయం తనకు తెలుసని రాధిక స్పష్టం చేసింది.