రాధికా ఆప్టే ఇంతకీ ఏ హీరోను కొట్టింది ? - MicTv.in - Telugu News
mictv telugu

రాధికా ఆప్టే ఇంతకీ ఏ హీరోను కొట్టింది ?

March 14, 2018

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్  చిత్రాలపైనే తన దృష్టి పెట్టిన రాధిక సినీ తారలపై లైంగిక వేదింపులు జరగడం నిజమేనని చెప్పి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా దక్షిణాది సినీ హీరోపైన కామెంట్స్ చేసింది. బాలీవుడ్ నటి నేహా  దూపియా నిర్వహిస్తున్న ‘టాక్ షో వోగ్ బీఎఫ్ఎఫ్’ కార్యక్రమాన్నికి రాధిక వెళ్లింది.

రాధిక మాట్లాడుతూ… ‘నేను నటించిన తొలి దక్షిణాది సినిమాలో నాతో నటించిన ప్రముఖ హీరో చెంప పగలగొట్టాను. ఆ సినిమా చిత్రీకరణ తొలిరోజు నేను సెట్‌కి వెళ్లాను.ఆ రోజే ఆ హీరో నా పక్కన కూర్చొని అతని కాలితో అసభ్యంగా రుద్దాడు. ఆ వ్యక్తి నాకు అప్పటి వరకు పరిచయమే లేడు. అలా ప్రవర్తించడంతో కోపంతో చెప్ప చెళ్లుమనిపించాను’ అని రాధిక చెప్పింది. ఇంతకీ ఆ హీరో ఎవరన్నది మాత్రం ఆమె చెప్పలేదు.

రాధిక తెలుగులో ‘రక్త చరిత్ర’,‘రక్త చరిత్ర2’,‘దోని’, ‘లెజెండ్’, ‘లయన్’  చిత్రాలలో నటిచింది. తమిళంలో ‘కబాలి ’ సినిమాలో నటించింది.