బాలీవుడ్ నటుడికి జైలు శిక్ష.. అతని భార్య కూడా - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ నటుడికి జైలు శిక్ష.. అతని భార్య కూడా

April 24, 2018

బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీలోని ‘కర్‌కర్ డూమా ’ కోర్టు  దోషిగా తేల్చింది. రుణ రికవరీ కేసులో ,చెక్ బౌన్స్ సహా ఏడు కేసుల్లో రాజ్‌పాల్  యాదవ్‌ను ,అతని భార్య రాధను కోర్టు దోషులుగా ప్రకటించింది. ఈ నెల 23న న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేసింది.2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ  తీర్చకపోవడంతో బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరింది. గతంలో కోర్టు ఆదేశాలను విస్మరించినందుకు సుప్రింకోర్టు రాజ్‌పాల్ యాదవ్ ,అతని భార్యకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. దీంతోపాటుగా  రాజ్‌పాల్ యాదవ్ ,అతని భార్యకు చెందిన యాక్సిస్ బ్యాంకు జాయింట్ అకౌంట్‌ను, వారి కంపెనీ అంకౌట్‌ను సైతం అటాచ్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ సినిమాలు భూల్‌ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో  రవితేజ హీరోగా నటించిన ‘ కిక్‌ 2 ’ సినిమాలో కూడా ఆయన నటించారు.