శిల్పాశెట్టి  పిల్లి అదృశ్యం.. సాయం కోసం వేడుకోలు - MicTv.in - Telugu News
mictv telugu

శిల్పాశెట్టి  పిల్లి అదృశ్యం.. సాయం కోసం వేడుకోలు

April 19, 2018

చాలా మందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. వాటిని చాలా ముద్దు చేస్తూ, వాటితో ఆడుకుంటూ మైమరచిపోతుంటారు. ఆ జంతువులను వదలి క్షణం కూడా ఉండలేరు. అవి కనిపించకుండా పోతే అల్లాడిపోతారు. వీధివీధీ గాలిస్తారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. పోస్టర్లు వేస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె పెంపుడు పిల్లి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఇంట్లో, వీధిలో ఎంత వెతికినా కన్పించకపోయే సరికి ఆమె దాన్ని వెతికిపెట్టాలని అభిమానుల సాయం కోరింది.  

 


‘ఢియర్ ఫ్యాన్స్ .. నా పెంపుడు పిల్లి సింబా కన్పించడం లేదు. బుధవారం 2 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో వెతికినా కన్పించలేదు. దాని కోసం బాగా వెతుకుతున్నాం. ముంబయిలోని జుహు ప్రాంతంలో నివసించే వారెవరైనా దానిని చూస్తే నాకు సమాచారం అందించండి. చాలా బాధగా ఉంది. సింబా హిమాలయన్‌ పర్షియన్‌ జాతికి చెందింది. మీరు గుర్తుపట్టడానికి ఫొటో కూడా పోస్ట్‌ చేశాను. నిన్నటి నుంచి అది ఏమీ తినలేదు, తాగలేదు. అసలే ఎండాకాలం. నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ అది మీ కంటపడితే దయచేసి ముందు దానికి ఏదన్నా ఆహారం పెట్టండి’ అని  తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.