బాల్‌ఠాక్రే  బయోపిక్ - MicTv.in - Telugu News
mictv telugu

బాల్‌ఠాక్రే  బయోపిక్

December 14, 2017

శివసేన పార్టీ వ్యవస్థాపకులు దివంగత బాల్ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21 న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేస్తారని సంజయ్ చెప్పారు. అయితే దర్శకుడు,నటీనటులు ఎవరని అడిగితే ఆ ఒక్కటి అడక్కండి అని సంజయ్ సస్పెన్స్ క్రియేట్ చేశారు.