మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేదించాలి - MicTv.in - Telugu News
mictv telugu

మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేదించాలి

February 8, 2018

మసీదులు,ఇతర ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లు వాడకాన్ని నిషేధిచాలని ఏడాది కిందట బాలీవుడ్ గాయకుడు సోనూ  నిగమ్ చేసిన డిమాండ్‌పై రచ్చరచ్చ జరగింది. కొందరు మద్దతు పలకగా, చాలా మంది తిట్టిపోశారు. మతఛాందసులైతే చంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు.  తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్.. సోనూకు మద్దతు పలికారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లోని మసీదుల్లో,ఇతర ప్రార్థనా మందిరాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో లౌడ్ స్పీకర్లు వాడకుండా నిషేధం తేవాలని ఆయన కోరారు.

‘ఆన్ రికార్డుగా చెప్తున్నా.నేను సోనూ నిగమ్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లను  ఉపయోగించకండి’అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. కాగా, సోనూ నిగమ్ ప్రాణాలకు ముప్పు ఉందని తేలడంతో  ముంబై  పోలీసులు అతనికి భద్రతను కల్పించారు.ఈ నేపథ్యంలోనే జావేద్ అఖ్తర్ ఈ ట్వీట్ చేశారు.