ఫిట్‌నెస్ నేర్పించనున్న సన్నీలియోన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫిట్‌నెస్ నేర్పించనున్న సన్నీలియోన్

October 24, 2017

ప్రపంచ ప్రఖ్యాత శృంగార నటి సన్నీ లియోన్ యోగా టీచర్‌గా మారనుంది.  ఎంటీవీలో  ప్రసారమవుతున్న ‘స్పిట్ల్స్  విల్లా’ అనే కార్యక్రమాన్నికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.  త్వరలో ఎంటీవీలో ప్రసారం కానున్న మరో కార్యక్రమంతోనూ సన్నీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

యోగాసనాలకు సంగీతం మేళవిస్తూ ఎంటీవీ బీట్స్ చానల్ లో ‘ఫిట్‌స్టాప్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దీని ద్వారా ప్రేక్షకులకు సన్నీ యోగాసనాలను నేర్పించనుంది.‘ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా  ఉండాలంటే యోగాసనాలు  చేయడం చాాలా అవసరం.రోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం తప్పకుండా చేయాలి. అందుకోసమే ఎంటీవీతో కలసి ఫిట్ స్టాప్ పేరుతో ఓ కార్యక్రమం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల వ్యాయామాలను  పరిచయం చేస్తాన ’ని సనీ చెప్పింది.

గతంలో కూడా సన్నీ సూపర్ హాట్ సన్నీ మార్నింగ్స్ పేరుతో  టైమ్స్ లివింగ్ వారి యూట్యూబ్ ఛానల్ లో ఒక ఫిట్ నెస్ కార్యక్రమం చేసింది. కేవలం 6 ఎపిసోడ్లు మాత్రమే కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా మంచి వ్యాయామాలను సన్నీ  ప్రేక్షకులకు పరిచయం చేసింది.