టాప్ హీరోయిన్ కావాలంటే పరీక్ష  రాయాలా?   - MicTv.in - Telugu News
mictv telugu

టాప్ హీరోయిన్ కావాలంటే పరీక్ష  రాయాలా?  

October 31, 2017

తన సినీ జీవితంలో దక్షిణాదిలోనే ఎక్కువ అపజయాలు  చవిచూశాను అని హీరోయిన్ తాప్సీ అంటోంది. తెలుగులో నటించిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో తాప్సీ మంచి విజయం అందుకుంది. మరోపక్క బాలీవుడ్‌లో  ఆమె నటించిన ‘జుడ్వా2’ కూడా మంచి విజయం సాధించింది.

‘తాను ఎన్ని సినిమాలు చేసిన కూడా టాప్ హీరోయిన్ గా గుర్తింపు రావడంలేదని’ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘ నాకు ఇప్పటీకి టాప్ నటి అన్న పదానికి అర్థమే తెలియదు, ఓ నటిగా నాకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కానీ ఓ ఫ్యాషన్ డిజైనర్ దుస్తుల ప్రదర్శన కోసం  నాలాంటి నటి వద్దు , అగ్ర స్థానంలో ఉన్న నటినే కావాలని అంటే  మాత్రం నాకు నచ్చదు. నాకు చాలా బ్రాండ్ల విషయంలోను ఇలాంటి పరిస్థితే ఎదురైంది .

నేను చెప్పేది ఏంటంటే, టాప్ నటి అని నిరూపించుకోవడానికి ప్రవేశ పరీక్ష రాయడానికి సిద్దంగా ఉన్నాను. కానీ ఆ పరీక్ష ఎలా రాయాలో చెప్తారా? ఇందుకోసం అవార్డులు గెలుచుకోవాలా? అని ప్రశ్నించింది.  విజయాలను ఎవరు నియంత్రణ చేయలేరు’ అని అన్నది.  ప్రస్తుతం తాప్సీ ‘ముల్క్’ అనే  చిత్రంలో నటిస్తోంది. ఇందులో అలనాటి  బాలీవుడ్ నటుడు  రిషీ కపూర్, రజిత్ కపూర్ , నీనా గుప్తా , ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.