నేనూ పెళ్లి చేసుకుంటా..  టబు@47 - MicTv.in - Telugu News
mictv telugu

నేనూ పెళ్లి చేసుకుంటా..  టబు@47

November 21, 2018

బాలీవుడ్‌లో మరో మహాముదురుభామ పెళ్లిపై మనసు పడింది. టాలీవుడ్‌లోనూ మాంచి హిట్లు కొట్టిన నటీమణి టబు తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని మనసులోమాట బయటిపెట్టింది. తనకు అన్ని విధాలా తగిన వరుడి కోసం వేచిచూస్తున్నానని, అతడు దొరకగానే పెళ్లాడతానని చెప్పిందీ 47 ఏళ్ల ప్రౌఢ ఓ ఇంటర్వ్యూలో.

Telugu news Bollywood Tollywood actress Tabu says she is ready to marry if the the suitable person found

‘పెళ్లి మొదట్లో వద్దనుకున్నాను.. చాలా కారణాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్నాను. నాకు పెళ్లికాలేదు కనుక దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనసుకు నచ్చిన వాడిని, నా అభిప్రాయాలను గౌరవించే వాడిని తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కానీ అందుకోసం చాలా కాలం ఎదురు చూడాలేమో.. ’ అంది. తాను అజయ్ దేవగణ్ కారణంగానే పెళ్లి చేసుకోలేదని, అతనితో కలిసి తిరిగానని టుబు కొన్నాళ్ల కిందట చెప్పింది.

టుబుకు పెళ్లిపై మనసుపడ్డానికి నటుడు ఆయుష్మాన్ ఖురానాతో మాటముచ్చట ఓ కారణం. ఆమె అతనితో కలసి అంధధున్ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా అతని తండ్రి జ్యోతిష్యుడు అని తెలుసుకుంది. ‘మీ నాన్న జ్యోతిష్యుడు అని నాకెందుకు చెప్పలేదు. నా జాతం చూపించుకునేదాన్ని కదా.. పెళ్లవుతుందో లేదో తెలిసేది.. ’ అని అంది.

Telugu news Bollywood Tollywood actress Tabu says she is ready to marry if the the suitable person found