ఆమె బరువు 57… చీర బరువు 40.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె బరువు 57… చీర బరువు 40..

November 27, 2017

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల 40 కిలోల జరీ చీరను డిజైన్  చేయించుకుంది. తన కజిన్ పెళ్లి కోసం ఏకంగా రూ. 55 లక్షల విలువైన ఈ  చీరను ప్రముఖ డిజైనర్‌తో డిజైన్ చేయించుకుంది. డిసెంబర్‌లో జరగనున్న తన కజిన్ పెళ్లిలో మెరవడానికి దీన్ని ప్రమేతో నేయించుకుంది. అంతేకాదు దాదాపుగా రూ. 28 లక్షల విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఊర్వశి ఈ చీర కట్టుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లవ్ డోస్ ’ అనే ఆల్బమ్‌తో ఊర్వశికి మంచి గుర్తింపు వచ్చి సినిమా అవకాశాలు వచ్చాయి. ‘సనమ్ రే’ ‘కాబిల్’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ వంటి చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘హేట్ స్టోరీ 4’ చిత్రంలో నటిస్తోంది.