Home > ప్రభాస్‌‌తో  చేయను  

ప్రభాస్‌‌తో  చేయను  

టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్‌ను, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ పక్కకు పెట్టాడు. బాలీవడ్‌లో కరణ్ జోహర్ ఓ సినిమాను రూపొదించేందుకు సన్నాహలు చేస్తున్నాడు.

ఆ సినిమాలో ప్రభాస్‌కు అవకాశం ఇవ్వాలనుకున్నాడు.,కానీ మన తెలుగు హీరో ఆ చిత్రంలో నటించడానికి పారితోషకంగా రూ. 20 కోట్లు డిమాండ్ చేశారని సినీ వర్గాల టాక్. దీనితో కరణ్ ప్రభాస్‌ను తన సినిమా నుంచి తప్పించాలని ఫిక్స్ అయ్యాడు.

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అంత మెుత్తాన్ని డిమాండ్ చేయలేదన్న వాదన వినిపిస్తుంది. ప్రభాస్‌కు బదులుగా వరుణ్ ధావన్‌కు రూ. 25 కోట్లు ఇవ్వడం ఉత్తమం అన్న అభిప్రాయంలో కరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై కరణ్ ఎవరికి అర్థం కాని పద్దతిలో ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రాన్ని కరణ్ బాలీవుడ్‌లో ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

Updated : 28 Oct 2017 5:09 AM GMT
Next Story
Share it
Top