కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు - MicTv.in - Telugu News
mictv telugu

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు

February 24, 2018

భద్రత ఎంత కట్టుదిట్టంగా వున్నా తీవ్రవాదుల ఆగడాలు ఆగటం లేవు. ఖమ్మం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం రేగింది. ఒక్కసారిగా రైల్లో ప్రయాణీకులంతా భయాందోళనలకు గురయ్యారు. ఎస్11 కోచ్‌లోని సీటు నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా రెండు బ్యాగులు ఉండటంతో.. రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు.

వెంటనే డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు ఎస్ 11 కోచ్‌లో తనిఖీలు నిర్వహించాయి. ఆ బ్యాగులను స్టేషన్‌కు దూరంగా తీసుకువెళ్లి చూశారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బాంబు స్కాడ్ బృందాలను అధికారులు రప్పిస్తున్నారు. ఈ బ్యాగులను ఎవరు రైల్లో పెట్టారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.