రైల్వే ట్రాక్‌పై బాంబు.. ప్రయాణికులు బెంబేలు - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వే ట్రాక్‌పై బాంబు.. ప్రయాణికులు బెంబేలు

January 9, 2019

రైల్వే ట్రాక్‌పై బాంబు కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అశోక్‌నగర్‌లోని రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువును గుర్తించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు.Telugu News bomb found on railway track in west bengalవెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వస్తువును బాంబుగా గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌ను పిలిపించి బాంబును నిర్వీర్యం చేసినట్లు తూర్పు రైల్వే సీపీఆర్‌వో నిఖిల్‌ కుమార్‌ తెలిపారు. బాంబు ఘటనతో రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. బాంబును నిర్వీర్యం చేసిన తర్వాత ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు నిఖిల్‌ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.