మంచం కింద బాంబు పెట్టి భర్తను చంపేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

మంచం కింద బాంబు పెట్టి భర్తను చంపేసింది..!

February 14, 2018

నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్‌ కాంగ్రెస్‌ నేత ధర్మానాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. నాగార్జునపేట తండాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి ఆశ్చర్యకర విషయాలను బయటపెట్టారు. అక్రమ సంబంధమే దీనికి కారణమని, ధర్మానాయక్‌ను అతని రెండో  భార్య శిరీషే  అంతమొందించిందని పోలీసులు తెలిపారు.ధర్మనాయక్‌ మొదటి భార్య సావిత్రికి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె చెల్లి అయిన శిరీషను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక బాబు, ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ధర్మానాయక్‌, శిరీషల నడుమ 23 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. కాగా శిరీష అదే గ్రామానికి చెందిన ఆంగోతు రవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్లు వీరిద్దరు   కలిసి ఎటో వెళ్లిపోయారని, తిరిగి వారిని తీసుకువచ్చి పంచాయతీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

అడ్డుగా వున్నాడని :
తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడని శిరీష భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆ క్రమంలోనే ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రాత్రి ధర్మనాయక్‌ బావమరిది భోజనం కోసం వచ్చినప్పుడు ఆయన పక్కన కుమారుడు పడుకుని  ఉన్నాడు. శిరీష మాత్రం మంచం పక్కన కింద పడుకొని ఉంది. కానీ హత్య జరిగిన సమయంలో శిరీష కుమారుడితో కలిసి గదిలో పడుకుని ఉంది. ఈ కోణంలో పోలీసులు ఆమెను విచారించారు.