mictv telugu

తెరపైకి శ్రీదేవి బయోపిక్… ఏర్పట్లలో బోనీ

January 10, 2019

దివంగత అందాల తార శ్రీదేవి బయోపిక్ తీయడానికి ఆమె భర్త బోనీకపూర్ సిద్ధమవుతున్నారు. శ్రీదేవి జీవిత నేప‌థ్యంలో ఓ చిత్రం చేయాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారికంటే ముందే బోని.. శ్రీదేవి బ‌యోపిక్ చేయాల‌ని అనుకుంటున్నారట. శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన బోనీ క‌పూర్ అయితేనే ఆ చిత్రానికి న్యాయం చేయ‌గ‌ల‌రని అభిమానులు కూడా భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని తెలుస్తోంది.  ఇప్ప‌టికే శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నారని స‌మాచారం. బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో కెరియర్ మొదలు పెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. అటుపై తెలుగు, హిందీ వరకు ఆమె సినీ ప్రస్థానం కొనసాగింది.Telugu news Boney Kapoor to produce and direct the biopic on his beloved wife Sridevi? Details insideకాగా, శ్రీదేవి పాత్ర చెయ్యటానికి అందంతో పోటీపడే కథానాయిక కావాల్సి వస్తుంది. మరి బోనీ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో ఇప్పటికైతే సస్పెన్సే. మరోవైపు జాన్వీకపూర్‌తోనే శ్రీదేవి పాత్రను చేయిస్తే బాగుంటుందని బోనీ సన్నిహితులు ఆయనకు సూచించారట. చూడాలిమరి బోనీ కుమార్తెతోనే శ్రీదేవి బయోపిక్ మొదలు పెడతారేమో. ఆయనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారా, లేకపోతే వేరే దర్శకుడిని ఎంచుకుంటారా, నిర్మాతగానే వ్యవహరిస్తారా, ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

అయితే గతంలో బోనీ శ్రీదేవి బయోపిక్ తీస్తే విశాలమైన ఆమె జీవితాన్ని మూడు గంటల్లో చూపలేమని అన్నారు. డాక్యుమెంటరీ తీస్తామని వెల్లడించారు. మరి ఇంతలో ఆయన నిర్ణయం మార్చుకున్నారు. డాక్యుమెంటరీ అయితే కొంతమందికే చేరుతుంది. సినిమా అయితే అందరికీ చేరుతుందని బహుశా అభిప్రాయాన్ని మార్చుకున్నట్టున్నారు. దీంతోపాటు శ్రీదేవి జీవితం మీద పుస్తకం తెస్తున్నట్టు కూడా బోనీ ప్రకటించిన విషయం తెలిసిందే.Telugu news Boney Kapoor to produce and direct the biopic on his beloved wife Sridevi? Details inside