రాజీనామా వార్తల్లో నిజం లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

రాజీనామా వార్తల్లో నిజం లేదు..

November 28, 2017

ఈరోజు ప్రారంభమైన  మెట్రోరైల్  ప్రారంభోత్సవ పలకపై తన పేరు లేకపోవడంతో, కలత చెందిన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రాజీనామా చేసినట్టు  పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై బొంతు రామ్మోహన్ స్పందించారు.

‘మెట్రో రైల్ ప్రారంభోత్సవ౦ సందర్భంగా అవమానం జరిగిందని, ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనై మేయర్ పదవికి రాజీనామా చేశానని.. నేడు ఉదయం నుండి పలు సోషల్ మీడియాల్లో తప్పుడు వార్తలు తనపై వస్తున్నాయని, ఈ తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కోరుతూ.. సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్‌కు ఫిర్యాదు చేసాను’ అని మేయర్ రామ్మోహన్ తెలిపారు.

‘బీసీలకు చెందిన వ్యక్తిని కాబట్టే తన పేరు వేయలేదంటూ తాను పేర్కొన్నట్టు.. పుకార్లలో చెప్పారు. దానిలో ఎంత మాత్రం నిజం లేదని రామ్మోహన్ స్పష్టం చేశారు. తెలంగాణాతో పాటు హైదరాబాద్ పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, యువ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేయనున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టంచేశారు.