తీట పోరడు...లిఫ్ట్‌లో  పాట పాడాడు ? - MicTv.in - Telugu News
mictv telugu

తీట పోరడు…లిఫ్ట్‌లో  పాట పాడాడు ?

February 26, 2018

కోతి పోరడు , తీట పోరడు, గడుసు పోరడు అని అంటరు గదా ఇగో  ఇటువంటి వాళ్లనే. ఇంతకీ  ఈ పోరడు ఏం చేశాడో తెలుసా? అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఎక్కాడు.  లిఫ్ట్‌లో ఒక్కడే ఉన్నాడు. మరి ఏమనిపించిందో ఏమో, అర్జంటో గాని  ఒక్కసారిగా జిప్ ఓపెన్ చేసి లిఫ్ట్ లో మూత్రం పోశాడు.  లిఫ్ట్‌లో ఉన్న నంబర్లపై  పంపు కొట్టినట్టు  మూత్రంతో తడిపేశాడు.


అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతి మరుక్షణమే  పోరడికి  అసలు కష్టాలు మొదలయ్యాయి. ఓపెన్ కావాల్సిన లిఫ్ట్ డోర్లు ఒక్కసారిగా ఒపెన్ అయ్యి మళ్లీ మూసుకుపోయింది. లైట్లు బంద్ అయ్యాయి.  పోరడికి టెన్షన్ మొదలైంది. ఎందుకన్నా మూత్రం పోస్తి అనుకున్నాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడానికి బటన్లు నొక్కాడు అయినా ఓపెన్ కాలేదు.

లిఫ్ట్ లోపల మొత్తం చీకటైపోయింది. ఆ పిల్లాడికి ఏడుపు ఒకటే తోడయ్యింది.  అయితే ఈలోగా ఆప్రమత్తమైన  అపార్ట్ మెంట్ సిబ్బంది లిఫ్ట్ డోర్లు ఓపెన్ చేసి ఆ కుర్రాడిని క్షేమంగా  బయటకు తీసుకువచ్చారు. ఇంకా వాడి కిిస్మత్ మంచిగుండి  లిఫ్ట్ లో షాక్ కొట్టలేదు.  అయితే కుర్రాడు లిఫ్ట్ లో  చేసిన నిర్వాహకం మొత్తం అందులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.  ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలో జరిగింది ఈ ఘటన.